సిక్కిరెడ్డికి శాట్స్ ఘన స్వాగతం

ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా నిన్న అర్జున అవార్డ్ అందుకొని హైదరాబాద్ వచ్చిన తెలంగాణకు చెందిన యువ షట్లర్ సిక్కిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికారు.

తనకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని సిక్కిరెడ్డి తెలిపింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే మ్యాచ్ లలో మరింత నైపుణ్యంతో దేశానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.