మరో హ్యాట్రిక్‌ పై మైత్రీ మూవీ మేకర్స్‌ కన్ను

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్‌.. డబుల్‌ హ్యాట్రిక్‌ పై కన్నేసింది. ఇప్పుడు ఈ బేనర్‌ లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రం, నాగ చైతన్య సవ్యసాచి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ బానర్స్‌ పైనే నిర్మితమవుతున్నాయి.

శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రం అక్టోబర్‌ 5న విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ నటించిన సవ్యసాచి చిత్రాన్ని నవంబర్‌ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా, కాజల్‌, కేథరిన్‌ లు కథానాయికలుగా ఓ మూవీని చేయనున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాకు సంబంధించి కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బానర్‌ పై రానుంది. హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌ మరో హ్యాట్రిక్‌ పై నమ్మకం పెట్టుకుంది. ‘అఅఆ’ చిత్రం, ‘సవ్యసాచి’ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ ఆశలు ఉన్నాయి.

కాగా ఎంఎంఎం నిర్మాణ సంస్థను న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ లు క‌లిసి మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై సినిమాలు చేస్తున్నారు.