కన్నీరు పెట్టుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి

సీఎం పదవి అంటే ఎవరికి ఇష్టముండదు? కానీ కర్నాటక సీఎం కుమారస్వామి మాత్రం తనకు గొంతులో గరళాన్ని దాచుకున్నట్లు ఉందంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంత సులువు కాదని, ప్రజల కోసం ఎంతో చేస్తున్నప్పటికీ.. వారి మద్దతు పొందలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ కార్యకర్తల సమావేశంలో తన పరిస్థితి చెప్పుకుంటూ.. భోరున విలపించారు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం జనతాదళ్‌ కార్యకర్తలకు మాత్రమే సంతోషమని, తనకు మాత్రం కాదన్నారు. రైతు రుణమాఫీ కోసం డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్ధం కావడం లేదని, అందుకే  పన్నుల భారం మోపినట్లు చెప్పారు కుమారస్వామి. సంకీర్ణ ప్రభుత్వంలో గరళాన్ని మింగిన శివుడిలా తన పరిస్థితి తయారైందంటూ కన్నీరు పెట్టుకున్నారు.