జులై 11 నుంచి హైదరాబాద్‌ లో సాహో షెడ్యూల్‌

అంతర్జాతీయంగా కలెక్షన్ల వర్షం కురిపించిన తెలుగు చిత్రం బాహుబలి సిరీస్‌. బాహుబలి ది కన్‌క్లూజన్‌ చిత్రంతో భారీ విజయం అందుకున్న ప్రభాస్‌ తాజా చిత్రం సాహో అబుదాబిలో షెడ్యూల్‌ పూర్తైంది. తర్వాత జులై 11 నుండి సాహో చిత్ర షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. రన్‌ రాజా ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యూవీ క్రియేషన్స్‌ బేనర్స్‌ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ షెడ్యూల్‌లో అత్యంత క్లిష్టమైన స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, చేజింగ్ ఫైట్స్ 90 కోట్ల భారీ వ్య‌యంతో తెర‌కెక్కించారు.