కుటుంబంతో సహా విలేకరి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలోని కొండపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రభూమి రిపోర్టర్‌గా పనిచేస్తున్న హన్మంతరావు తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు విషం ఇచ్చి భర్త ఉరివేసుకున్నాడు. భర్త హన్మంతరావు, చిన్నారులు మృతి చెందగా, ఉదయం గుర్తించిన స్థానికులకు కొన ఊపిరితో కొట్టుకుంటున్న హన్మంతరావు భార్య కనిపించింది. ఆమెను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.