హైకోర్టులకు, డీజీపీలకు సుప్రీం సూచనలు

హైకోర్టులకు, డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశాలుచిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులపై నమోదయ్యే కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాలికలపై అత్యాచారం చేసే నిందితుల కేసుల విషయంలో హైకోర్టులు, డీజీపీలకు సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు న్యాయస్థానాల్లో వెంటనే పరిష్కారం అయ్యేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అలాగే అన్ని రాష్ట్రాలకు చెందిన డీజీపీలు ఈ అంశంపై ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి కేసుల్ని విచారించాలని సూచించింది. దేశంలో బాలికలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టానికి ఇటీవల కేంద్రం కీలక సవరణలు చేసింది. ఇటీవల 12 ఏళ్లలోపు బాలికలపై అమానుషానికి పాల్పడితే మరణదండన విధిస్తూ అత్యవసర ఆదేశం(ఆర్డినెన్స్‌) తీసుకొచ్చింది.