నా ఆలోచనలన్నీ దాని మీదే!

సినిమాని సినిమాలా కాకుండా, జీవితంలా భావించే కథా నాయికలు కొంతమంది ఉన్నారు. వాళ్లలో అనుష్క పేరు కూడా చేర్చుకోవచ్చు. ఆమె ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుతుంది. సినిమాల గురించే ఆలోచిస్తుంది. ఇది తప్ప మరో ప్రపంచం ఉంటుందా? అన్నట్టు ప్రవర్తిస్తుంటుంది. ‘‘నా ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఓ మంచి దృశ్యం చూశాననుకోండి.. నా మనసు సినిమాలవైపు మళ్లిపోతుంది.  ఇలాంటివి తెరపై చూపిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఎక్కడైనా ఓ గొప్ప మాట చదివితే.. ఇలాంటివి సినిమాలో చెబితే జనాలకు చేరువ అవుతుందనిపిస్తుంది. నటి అయ్యాక నేను వస్తువుల్ని, మనుషుల్ని, ప్రకృతిని చూసే కోణమే మారిపోయింది. నేను నటించిన సినిమా విడుదల అవుతోందంటే… అంతకు ముందు రోజు రాత్రి ఇవే కలలు. ఇదంతా సినిమాపై నాకున్న ప్రేమకి చిహ్నాలేమో’’ అని చెప్పింది అనుష్క.