ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన కేటీఆర్, జగదీశ్‌ రెడ్డి సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. మంత్రుల కమిటీ రేపు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానుంది.