సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువు పొడగింపు

నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలిచ్చేందుకు బీసీల అభివృద్ధిశాఖ రంగం సిద్ధం చేసింది. స్వయం ఉపాధికి ఊతమిచ్చేందుకు, యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు అవకాశమిస్తోంది. సబ్సిడీ రుణాల కోసం వేచిచూస్తున్న వారికి సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు అందించేందుకు రంగం సిద్ధమైంది. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఏప్రిల్ 21 వరకు గడవు పొడగించినట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

21 -55 ఏండ్ల మధ్య వయస్కులు, రూ. రెండు లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 4 లోపు http : ts.obmms. cgg.gov.in లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2015-16 ఆర్థిక ప్రణాళికలో దరఖాస్తు చేసి, రాయితి పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

కేటగిరి-1లో లక్ష రూపాయలకు 80 శాతం రాయితీ,
కేటగిరి -2లో రూ. 2 లక్షలకు 70శాతం రాయితీ,
కేటగిరి -3లో రూ. 2 లక్షల నుంచి 12 లక్షల లోపు రుణానికి 60 శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
అలాగే 2015-16 వార్షిక సంవత్సరం నుంచి రుణపరిమితిని గణనీయంగా పెంచారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు రూ.1 లక్ష నుంచి గరిష్టంగా రూ.12 లక్షల లోపు రుణాలివ్వనున్నారు. రుణం ఎంత తెచ్చుకున్నా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తున్నారు. 33 శాతం మహిళల కోటాను అమలు చేస్తూ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు సాయమందిస్తున్నారు.

కావాల్సినవి సర్టిఫికెట్లు:
* కుల ధ్రువీకరణ పత్రం
* ఆదాయ ధ్రువీకరణ పత్రం
* ఆధార్‌కార్డ్
* పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
* విద్యార్హత ధ్రువీకరణ ప్రతాలు
* అభ్యర్థి ఫొటో