దేశవ్యాప్తంగా బీజేపీ నేతల నిరాహార దీక్షలు

దేశవ్యాప్తంగా బీజేపీ నేతల ఒక్క రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  కర్ణాటకలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో పాటూ పలువురు నేతలు దీక్షలో పాల్గొంటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి చర్చ జరుగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవాడానికి నిరసనగా.. ప్రధాని మోడీతో పాటూ బీజేపీ శ్రేణులు ఇవాళ ఒక్కరోజు దీక్ష చేపడుతున్నాయి. ప్రధాని మోడీ.. తన పనులను చూసుకుంటూనే దీక్షలో పాల్గొననున్నారు. డిఫెన్స్ ఎక్స్ పోలో పాల్గొన్న అనంతరం, ఆయన కర్ణాటకకు వెళ్లనున్నారు. అక్కడ దీక్షలో పాల్గొంటారు. అటు  థానేలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, ముంబైలో పరేష్ రావెల్ తో పాటూ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, కార్యకర్తలు దీక్ష నిర్వహిస్తున్నారు.