ఆదిలాబాద్ లో భగీరథ ట్రయల్ రన్ సక్సెస్

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. పట్టణంలో పైప్ లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించారు. గోదావరి జలాలు ఆదిలాబాద్ కు తరలిరావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు కొబ్బరి కాయ కొట్టి స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్ కు గోదావరి నీళ్లు తరలిస్తున్నారు. దాదాపు వంద కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

గోదావరి జలాల రాకతో ఆదిలాబాద్ పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను అక్షరాల నిజం చేశారని చెప్పారు.  సీఎం కేసీఆర్ కు ఆదిలాబాద్ మహిళలు ఎప్పటికీ రుణ పడి ఉంటారని అన్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించడం వల్లనే గడువులోగా పైప్ లైన్ పూర్తి చేసి సుదూర ప్రాంతం నుంచి నీటిని తరలించగలిగామని మిషన్ భగీరథ డీఈ మూర్తి అన్నారు.