భారత్ స్కోర్ 174/5

శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌ తొలి మ్యాచ్ లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదటగా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. శిఖర్ ధావన్-90 (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), మనీష్ పాండే-37, రిషబ్ పంత్-23, సురేశ్ రైనా-1, రోహిత్‌శర్మ డకౌట్ అయ్యాడు. శ్రీలంక ముందు 175 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.