వివాదంలో బాలీవుడ్ సింగర్ పాపన్                 

బాలీవుడ్ సింగర్ పాపన్ వివాదంలో చిక్కుకున్నారు. తన పాపులర్ రియాలిటీ షో వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్  షోలో ఓ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించారని ఆయనపై కేసు నమోదైంది. హోలీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ చిన్నారిని ఆయన బలవంతంగా ముద్దు పెట్టుకున్న వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఓ సుప్రీంకోర్టు లాయర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ లో ఫిర్యాదు చేశారు. పాపన్ ముద్దు పెట్టుకున్న బాలిక వాయిస్ ఆఫ్ కిడ్స్ షోలో కంటెస్టెంట్ గా ఉంది. ఈ షోలో పాల్గొంటున్న చిన్నారులతో హోలీ ఆడిన పాపన్.. ఆ బాలికకు కలర్స్ పూసి.. బలవంతంగా ముద్దు పెట్టారు.