ఇద్దరు పిల్లలకు తల్లిగా కాజల్!

గ్లామర్ కథానాయికలు క్రేజ్‌లో వుండగా ప్రయోగాల పేరుతో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కించనున్న తాజా చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించడానికి కాజల్ అంగీకరించినట్లు సమాచారం. హీరో వెంకటేష్‌తో సమాన ప్రాధాన్యత వున్న పాత్ర కావడం, నటనకు ఆస్కారం వుండటంతో కాజల్ తల్లి పాత్ర అయినా ఈ చిత్రంలో నటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ 50 చిత్రాల మైలు రాయిని దాటనుంది. కాగా ఈ చిత్రానికి ఆట నాదే వేట నాదే అనే టైటిల్‌ని చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.