ఇన్ఫోసిస్ కొత్త సీఈవో సలీల్ పరేఖ్

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నూతన సీఈవోగా సలీల్ పరేఖ్ నియమితులయ్యారు. క్యాప్ జెమినీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న ఆయన్ను ఇన్ఫోసిస్ సీఈవోగా నియమించినట్లు సంస్థ ప్రకటించింది. జనవరి 2న ఆయన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. క్యాప్ జెమినీ నుంచి పరేఖ్ వైదులుగుతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే… ఇన్ఫోసిస్ తన నిర్ణయాన్ని తెలిపింది.

బాంబే ఐఐటీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో పరేఖ్ బీటెక్‌ పూర్తి చేశారు. కార్నెల్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చదివారు. ఐటీ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులతో వచ్చిన అభిప్రాయబేధాల కారణంగా విశాల్ సిక్కా ఆగస్టులో ఆ సంస్థక సీఈవో పదవికి రాజీనామా చేశారు. దీంతో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న యూబీ ప్రవీణ్‌ రావుకు తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.