ఆ లిస్టులో సన్నీయే టాప్!

ప్రస్తుత సంవత్సరానికి గాను యాహూ సెర్చింగ్‌లో ఎక్కువమంది వెతికిన సెలబ్రిటీ జాబితాలో సన్నీలియోన్ టాప్ వన్‌గా నిలిచింది. ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ లను దాటుకొని తన సత్తా ఏంటో నిరూపించుకుంది. యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ-2017 జాబితాలో సన్నీ మొదటిస్థానం దక్కించుకోగా రెండో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచింది. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, మమతా కులకర్ణి ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. ఇక నటుల విషయానికొస్తే.. నటుడు వినోద్‌ ఖన్నా టాప్‌ ప్లేస్‌లో నిలవగా కపిల్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, రజినీకాంత్ లు నిలవడం విశేషం.