అలా పిలవడం పెద్ద గౌరవం!

ఓ సారి పని చేసిన దర్శకుడు మళ్లీ పిలిచి అవకాశమిస్తే అదో పెద్ద గౌరవంగా భావిస్తా. అలాంటి రోజు తెలుగు పరిశ్రమలో ఇంకా రాలేదు. కానీ.. భవిష్యత్తులో తప్పకుండా జరుగుతోందని ఆశిస్తున్నానని చెబుతోంది అనూ ఇమాన్యుయేల్‌. తన గ్లామర్‌తో వరుసగా అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌కి సెంట్రాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిందీ మలయాళీ బ్యూటీ. తాజాగా ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో ‘త్రివిక్రమ్‌ సార్‌తో మళ్లీమళ్లీ పని చెయ్యాలనుంది’ అని చెప్పింది. దీనిని బట్టి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్‌28’లో అను అవకాశం దక్కించుకోనుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల టాక్‌. అయితే అనుకి మాత్రం స్టార్‌ హీరోల సరసన నటించడమంటేనే ఇష్టం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. ‘‘ఒకసారి పని చేసిన దర్శకుడితో మళ్లీ పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తా. కెరీర్‌ బిగినింగ్‌లో మలయాళంలో అలాంటి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈసారి అలా జరగకుండా చూసుకుంటా’’ అని తెలిపింది అనూ ఇమాన్యుయేల్‌.