కోల్ కతాలో వర్షం, మ్యాచ్ ఆలస్యం

సొంతగడ్డపై టీమిండియా మరో సమరానికి రెడీ అయ్యింది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఇవాళ శ్రీలంకతో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కోల్ కతాలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అవుతోంది.

ఫార్మాట్ ఏదైనా అద్భుత ఆటతీరుతో అలరిస్తున్న కోహ్లీ సేన ఈ సిరీస్ లోనూ జైత్రయాత్ర కొనసాగించాలని చూస్తోంది. అటు రెండు నెలల కింద తమ సొంతగడ్డపై భారత్ చేతిలో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు లంక వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఈ మ్యాచ్ లోనూ విరాట్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకే మొగ్గు చూపుతున్నాడు. విజయ్ ప్లేస్ లో రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇక కోల్ కతా పిచ్ పేసర్లకు అనుకూలించనుంది.