స్వేచ్ఛగా అందాలను ప్రదర్శించిన బదిత బాగ్‌

మోడల్‌గా, నటిగా బాలీవుడ్‌లో ప్రత్యేకత తెచ్చుకుంది బదిత బాగ్‌. సామాజిక, రాజకీయ నేపథ్యమున్న పలు చిత్రాలతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు పరిశ్రమలోనూ ఆమెకు అవకాశం ఇవ్వాలంటే మంచి పాత్రలకు సంప్రదిస్తారు. ఇక ఇటీవల ఆమె నటించిన ‘బాబు మోషాయ్‌ బంధూక్‌ బాజ్‌’ విజయాన్నందుకుని ఆమె కెరీర్‌ వేగాన్ని పెంచింది. ఈ చిత్రంలో బదిత బాగ్‌ స్వేచ్ఛగా అందాలను ప్రదర్శించింది. సన్నిహిత సన్నివేశాల్లో సహజంగా నటించింది. బాలీవుడ్‌లో స్టార్స్‌కు మాత్రమే కాదు తమకూ ప్రాధాన్యత ఉందంటోందీ తార. ఇక్కడ నటీనటులను నిలబెట్టేది కేవలం వాళ్ల ప్రతిభే అని చెబుతోంది. బదిత బాగ్‌ మాట్లాడుతూ..’చిత్ర పరిశ్రమ నిజాయితీగా ఉంటుంది. ప్రతిభ, కష్టపడే తత్వమున్న వాళ్లకే ఇక్కడ గుర్తింపు. నటీనటులు ఎవరైనా తమ ప్రతిభను ప్రదర్శించలేకపోతే…వాళ్లకు పరిశ్రమలో స్థానం ఉండదు. సూపర్‌ స్టార్లుగా పిలుచుకునే నటీనటులు కూడా తమ శ్రమతోనే ఆ స్థానానికి చేరుకోగలిగారు. చిత్ర పరిశ్రమకు కేవలం స్టార్స్‌ మాత్రమే కాదు…ప్రతి నటీనటులు కావాలి.’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ బెంగాళీ భామ ‘రబ్బీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో గత సినిమాలోలా అందాల ప్రదర్శన ఉండదని చెబుతోంది. కాశ్మీరీ సంప్రదాయ కుటుంబ యువతిగా కనిపించనుందట బదిత బాగ్‌.

15.