వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్లోకి సింధు

బ్యాడ్మింట‌న్ సింగిల్స్‌లో త‌న ఆట తీరుతో అద‌ర‌గొడుతున్న సింధు మరో రికార్డు క్రియేట్ చేసింది. వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. చైనా క్రీడాకారిణిపై 21-13, 21-10 స్కోర్‌తో వ‌రుస గేమ్‌ల్లో గెలిచింది. సింధు ధాటికి వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 10 ప్లేయ‌ర్‌ చెన్ యూఫి చేతులెత్తేసింది. దీంతో సింధుకు వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్‌లో స్వ‌ర్ణం లేదా కాంస్య ప‌త‌కం ఖాయ‌మైంది. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో సింధుకు మెడ‌ల్ రావ‌డం ఇది మూడ‌వ సారి అవుతుంది. 2013, 2014 సంవ‌త్స‌రాల్లో సింధుకు ఈ టోర్న‌మెంట్‌లో బ్రాంజ్ మెడ‌ల్ వ‌చ్చింది. ఫైన‌ల్లో జ‌పాన్‌కు చెంద‌ని ఒకుహ‌రాతో సింధు తలపడనుంది.