అమరనాథ్ దాడి బాధితులకు గుజరాత్ సీఎం పరామర్శ

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ ఉగ్రదాడిలో మరణించిన అమరనాథ్ యాత్రికుల మృతదేహాలను గుజరాత్ చేర్చారు. శ్రీనగర్ నుంచి ఏడుగురు యాత్రికుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో సూరత్ కు తీసుకొచ్చారు. మృతులకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నివాళులు అర్పించారు. ఈ దాడిలో గాయపడ్డవారిని కూడా ఇదే విమానంలో గుజరాత్ తీసుకువచ్చారు. సూరత్ విమానాశ్రయంలో సీఎం విజయ్ రూపానీ క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం తరుపున బాధితులను ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డవారికి రెండు లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు.