ఐపీఎల్‌తో టెస్టు క్రికెట్‌కు ముప్పు

ఐపీఎల్‌తో భారత టెస్టు క్రికెట్‌కు నష్టం వాటిల్లుతున్నదని మాజీ కెప్టెన్ బిషన్‌సింగ్ బేడీ అభిప్రాయపడ్డారు. కేవలం టీ20 క్రికెటర్లుగా మారిపోతుండడంతో యువక్రికెటర్లకు టెస్టు క్రికెట్‌కు తగిన బ్యాటింగ్ సామర్థ్యం, ఓపిక లేకుండాపోతున్నదన్న బేడీ.. ఇందుకు భవిష్యత్‌లో భారత్ భారీ మూ ల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. ఐపీఎల్‌లో రూ.14 కోట్లు పలికిన క్రికెటర్‌తో కలిసి రూ.14 లక్షలు పలికిన క్రికెటర్ డ్రెస్సింగ్ రూంలో ఉంటున్నాడు. దీంతో ఆ క్రికెటర్‌తో సమానంగా సంపాదించాలన్న తలంపు మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి అవినీతి జాడ్యాలకు ఒక కారణంగా నిలుస్తుందన్నాడు.