రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైంది!

ర‌జ‌నీకాంత్ స‌స్పెన్స్‌ను కొన‌సాగిస్తున్నాడు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా రాడా అన్న‌ది నేరుగా చెప్ప‌కుండా.. రోజుకో ట్విస్ట్‌తో ఉత్కంఠ పెంచుతున్నాడు. తాజాగా ఐదో రోజు అభిమానుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా ర‌జ‌నీ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయన తన స్థానికత అంశంపై మాట్లాడారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నానని.. తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నానని చెప్పారు. తాను పుట్టింది మహారాష్ట్రలో అయినా అభిమానులు తనని తమిళుణ్ని చేశారన్నారు. తానిప్పుడు పక్కా తమిళుణ్ని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్నారు.  త‌మిళ రాజ‌కీయాల్లోనూ స్టాలిన్‌, అన్బుమ‌ని రాందాస్‌, తిరుమ‌వ‌ల‌వ‌న్‌లాంటి మంచి నేతలు ఉన్నా.. వ్య‌వ‌స్థ వారిని స‌రిగా ప‌నిచేయ‌నివ్వ‌డం లేదన్నారు. స్టాలిన్ స‌మ‌ర్థుడే ఆయ‌న కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారంటే దానికి కార‌ణం వ్య‌వ‌స్థే అని ర‌జనీ అన్నాడు.