రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక

ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న 52 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న వీరికి అవార్డులు ప్రదానం చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికైనవారు:

సాహిత్యం -వేలపాటి రామరెడ్డి, ఆశారాజు, జూపాక సుభద్ర, అస్లాం ఫర్షోరి

శాస్త్రీయ నృత్యం -రాఘవరాజు భట్‌-మంగళభట్‌, బి.సుధీర్‌రావు

పేరిణి నృత్యం -పేరిణి కుమార్‌,

జానపదం -దూరిశెట్టి రామయ్య, కేతావత్‌ సోంలాల్‌, గడ్డం సమ్మయ్య

సంగీతం -మాలిని రాజోల్‌ఖర్‌, వార్సి బ్రదర్స్‌

సామాజిక సేవ -వందేమాతరం ఫౌండేషన్‌, యాకూబ్‌ బీ

జర్నలిజం -పీవీ శ్రీనివాస్‌, వి.సతీష్‌,

ఫోటో జర్నలిజం -అనిల్‌కుమార్‌

సినిమా జర్నలిజం -హెచ్‌.రమేష్‌బాబు

వైద్యం –డాక్టర్ బీరప్ప(నిమ్స్‌), డా. చారి (సిద్ధ మెడికల్ ఆఫీసర్‌)

టీచర్స్‌ –డాక్టర్ ఎ.వేణుగోపాల్‌రెడ్డి (టీఎస్‌ఎంస్ జూనియర్ కాలేజీ, వీణవంక ‌),

పులిరాజు (జెడ్పీహెచ్‌ఎస్‌), అంగన్‌వాడీ టీచర్‌ -ఎం.బిక్షపమ్మ

ఉద్యమ గానం -కొడారి శ్రీను, వల్లాల వాణి, ఆవునూరి కోమల, అభినయ శ్రీనివాస్‌

పెయింటింగ్‌ -తోట వైకుంఠం, శిల్పం-శ్రీనివాస్‌రెడ్డి

సైంటిస్ట్‌ –డాక్టర్ ఎస్‌.చంద్రశేఖర్‌ (ఐఐసీటీ డైరెక్టర్‌),

యాంకరింగ్‌ -మడిపల్లి దక్షిణమూర్తి

అర్చకుడు -పురాణం నాగయ్యస్వామి, కొక్కెర కిష్టయ్య (మేడారం)

ఆధ్యాత్మికవేత్త -సంత్‌శ్రీ సంగ్రం మహరాజ్‌, ఉమాపతి పద్మనాభశర్మ, మహ్మద్‌ ఖాజా

షరీఫ్‌ షేక్‌ ఉల్‌ హదీస్‌ (మౌల్వీ), ప్రొఫెసర్ పెనుమల్ల ప్రవీణ్‌ ప్రభు సుధీర్‌ (బిషప్‌)

రంగస్థలం -దెంచనాల శ్రీనివాస్‌, వల్లంపట్ల నాగేశ్వర్‌రావు

స్పోర్ట్స్‌ -తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌, హకీంపేట, ఎండల సౌందర్య (హాకీ)

వేద పండిట్‌ -నరేంద్ర కాప్రె,

ఉత్తమ లాయర్‌-జె.రాజేశ్వర్‌రావు

ఉత్తమ మున్సిపాలిటీ -సిద్దిపేట,

ఉత్తమ గ్రామ పంచాయతీ-శ్రీనివాస్‌నగర్‌, మానకొండూరు

ఉత్తమ ఉద్యోగి –డాక్టర్ నేతి మురళీధర్‌ (టెస్కాబ్‌ ఎండీ), ఎన్‌.అంజిరెడ్డి (ఏఈఎస్‌)

ఉత్తమ రైతు -కండ్రె బాలాజీ, కెరామెరి,

స్పెషల్‌ కేటగిరి -గడ్డం నర్సయ్య, ఈల పాట

పురస్కార గ్రహీతలకు రూ. 1,01,116 నగదుతో పాటు జ్ఞాపిక, సర్టిఫికెట్ ఇచ్చి దుశ్శాలువాతో సత్కరిస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే వేడుకలో వీరికి పురస్కారం అందజేస్తారు. వీరితో పాటు జూన్ 2న జిల్లా స్థాయిలో కూడా సేవలు చేసిన వారికి మంత్రులు పురస్కారాలు ప్రదానం చేస్తారు. అన్ని జిల్లాల్లో కలిపి 341 మందిని ఇందుకోసం ఎంపిక చేశారు. వీరికి రూ.51,116 నగదుతో పాటు జ్ఞాపిక, సర్టిఫికెట్, దుశ్శాలువాతో సత్కరిస్తారు.