బాహుబలి ప్రీమియర్ షో రద్దు

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రం మరి కొద్ది గంటలలో రిలీజ్ కానుంది. ఇప్పటికే థియేటర్స్ దగ్గర జనాలు బారులు తీరగా, ఆన్ లైన్ లో అన్ని షోస్ ఫుల్ అయ్యాయి. అయితే బాహుబలి చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర నిర్మాతలు ఒక రోజు ముందుగానే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 27(గురువారం) సాయంత్రం పలు మల్టీ ప్లెక్స్ లతో పాటు సాధారణ థియేటర్స్ లోను బాహుబలి2 షో పడనుంది. ఇప్పటికే ఆ షోస్ కి సంబంధించిన టిక్కెట్స్ బుకింగ్ పూర్తయ్యాయి. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందస్తు ప్రదర్శనలు వేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేయడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. చిత్ర రిలీజ్ కి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో ప్రేక్షకుల్లో టెన్షన్ నెలకొంది.
మరో వైపు ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త వినోద్ ఖన్నా (70) ఈ రోజు క్యాన్సర్ కారణంగా మృతి చెందడంతో ఆయనకి సంతాపంగా బాలీవుడ్ లో బాహుబలి2 ప్రీమియర్ షోని నిలిపివేస్తున్నట్టు కరణ్ జోహార్ తెలిపాడు. ధర్మ ప్రొడక్షన్ పై బీటౌన్ లో బాహుబలి 2 చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది. అయితే కరణ్ నిర్ణయంతో బాలీవుడ్ లో బాహుబలి అభిమానులలో కాస్త నిరాశ నెలకొంది.