జాతీయ ఫిల్మ్ అవార్డ్ గ్రహీతలకు సీఎం కేసీఆర్ అభినందనలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన వారికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన పెళ్లిచూపులు సినిమా యూనిట్ ను, ఇదే చిత్రానికి ఉత్తమ సంభాషణల విభాగంలో అవార్డ్ పొందిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ ను ముఖ్యమంత్రి అభినందించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా శతమానం భవతి నిలువగా, ఉత్తమ నృత్య దర్శకుడిగా జనతా గ్యారేజ్ సినిమాకు రాజు సుందరం ఎంపికయ్యారు. వీరికి జాతీయ చలన చిత్ర అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.