కోల్‌కతాపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం  

గుజరాత్ లయన్స్‌  వరుస పరాజయాలకు బ్రేక్‌ పడింది. ఈడెన్‌ గార్డెన్స్‌ లో  కోల్‌ కతా తో  జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌.. స్ఫూర్తిదాయక విజయాన్ని  దక్కించుకుంది.  కెప్టెన్‌ రైనా  బౌండరీలు, సిక్సులతో చేలరేగడంతో ఈ సీజన్‌ లో గుజరాత్ కు రెండో  విజయం దక్కింది. కోల్‌ కతా  విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని.. ఆరు వికెట్లు కోల్పోయి చేధించిన గుజరాత్  లయన్స్‌.. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది.

టాస్‌ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన కోల్‌ కతా.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ గా వచ్చిన నరైన్‌.. మరోసారి సత్తా చాటాడు. కేవలం 17 బాల్స్‌ లోనే 42 రన్స్‌ తో కోల్‌ కతాకు ఫ్లయింగ్‌ స్టార్ట్‌ ఇచ్చాడు. అటు గంభీర్‌ 33 రన్స్‌ చేయడం కోల్‌ కతాకు మంచి ఆరంభం దక్కింది. అటు ఊతప్ప 48 బాల్స్‌ లో 72, పాండే 24 రన్స్‌ చేయడంతో.. కోల్‌ కతా 187 రన్స్‌ చేసింది. 

188 టార్గెట్‌ తో బరిలోకి దిగిన గుజరాత్ కు ఫించ్‌, మెకల్లమ్ సూపర్‌ స్టార్ట్‌ ఇచ్చారు. ఫించ్‌ 15 బాల్స్‌ లో 31, మెకల్లమ్‌ 17 బాల్స్‌ లో 33 రన్స్‌ చేయడంతో.. గుజరాత్‌ ఎదురు లేకుండా పోయింది. ఫించ్‌, మెకల్లమ్‌ అవుటైనా.. రైనా.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ తో చేలరేగాడు. జస్ట్‌ 46 బాల్స్‌ లో 84 రన్స్‌ చేసి సత్తా చాటాడు. ఒక ఎండ్‌ లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో రైనా రాణించడంతో.. గుజరాత్‌ మరో పది బంతులు ఉండగానే విజయాన్ని దక్కించుకుంది.

సూపర్‌ బ్యాటింగ్‌ తో టీమ్ కు విజయాన్ని అందించిన సురేష్‌ రైనా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా ఎంపికైండు. ఈ విజయంతో గుజరాత్‌ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి.