ప్రతిపక్షాలు కులవృత్తుల అభివృద్ధికి సహకరించాలి

రాష్ట్ర బడ్జెట్ లో అన్ని కులాలకు అధిక నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు. అనవసరపు రాజకీయాలు మానుకుని కులవృత్తుల అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్నూరు కాపు సంఘం నూతన భవనాన్ని కేకే ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.