పాట్నా పడవప్రమాదంలో 24కు చేరిన మృతుల సంఖ్య

పాట్నాలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 24 కు చేరింది. గంగా నదీ తీరంలో శనివారం పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నిన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. గల్లంతైన మరికొందరి కోసం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాద సమయంలో పడవలో 40 మంది ప్రయాణిస్తున్నారు. మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం 4 లక్షలు, కేంద్రం 2లక్షలు , గాయపడ్డవారికి 50వేల చొప్పున పరిహారం ప్రకటించింది. అటు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.