8న ఎన్ఎండీసీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఎన్ఎండీసీ) ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఎన్ఎండీసీ సీఎండీ బజేంద్ర కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ తో పాటు పలు రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు పాల్గొంటారని బజేంద్ర కుమార్ వెల్లడించారు.