536 పరుగులకు భారత్ డిక్లేర్డ్   

ఢిల్లీ టెస్ట్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్ కోహ్లీ సూపర్ షో తో అలరించాడు. కెరీర్ లో ఆరో డబుల్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 371 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా.. వేగంగా పరుగులు చేసింది, విరాట్ తో పాటు రోహిత్ వన్డే తరహాలో రెచ్చిపోయారు. లంచ్ లోపే డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ.. 243 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీగా ఔట్ అయ్యాడు. రోహిత్ 65 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో సండకన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇక కాలుష్యంతో మ్యాచ్ కు పలుసార్లు అంతరాయం కలిగింది. లంక ప్లేయర్లు అభ్యంతరం తెలపడంతో 15 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక తొలి బంతికే వికెట్ ఓపెనర్ కరుణరత్నే వికెట్ కోల్పోయింది.