10 కోట్లు దాటిన మీ-సేవ లావాదేవీలు

తెలంగాణ మీ-సేవ 10 కోట్ల లావాదేవీలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ మీ-సేవ ఆపరేటర్ల అసోసియేషన్ వేడుకలు జరుపుకుంది.  ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ టీఎస్ చైర్మన్ రాకేష్, 31 జిల్లాల మీ-సేవ ఆపరేటర్లు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మీ-సేవ ద్వారా స్వల్పకాలంలోనే 10 కోట్ల ఆన్ లైన్ లావాదేవీలు జరిపిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి గడించింది.

ఈ సందర్భందా మంత్రి కేటీఆర్ మీ-సేవ అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించారు. జీఎస్టీ రిటర్న్ ఫిల్లింగ్ పోస్టర్ ను మంత్రి కేటీఆర్  ఆవిష్కరించారు. 10 కోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న మీ-సేవ ఆపరేటర్స్ ను సన్మానించారు. 31 జిల్లాల మీ-సేవ ఆపరేటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.