సారీ ప్రియాంకా!

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్ళిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం అటు సినిమాలు ఇటు సీరియల్స్ తో బిజీ బిజీగా ఉంది. జైగంగాజల్ అనే చిత్రం ప్రియాంకకి బాలీవుడ్ లో చివరి మూవీ కాగా ఇప్పుడు క్వాంటికో-3 సీరియల్ తో పాటు ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే హాలీవుడ్ చిత్రాలు చేస్తుంది. అయితే గ‌త నెల 9న ప్రముఖ మేగ‌జైన్ ఫెమినాకి ప్రియాంక చోప్రా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇందులో త‌న బాయ్ ఫ్రెండ్ పేరు ప్ర‌స్తావించ‌కపోయ‌న‌ప్ప‌టికి ,ఆ మేగ‌జైన్ పేరు చెప్పిన‌ట్టు ప్ర‌చురించింది. అంతేకాదు ప్రియాంక బోయ్ ఫ్రెండ్ పేరు ఎంఎఫ్ అని ప్ర‌చురించ‌డంతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఫెమినా అభిమానుల‌తో పాటు ప్రియాంక‌కి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేసింది. గ‌తంలోను ప్రియాంక బోయ్ ఫ్రెండ్‌కి సంబంధించి ప‌లు పుకార్లు వ‌చ్చాయి.