సాయి పల్లవి ఓవరాక్షన్!

ఫిదా సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని మాత్రం మరిచిపోయినట్టుంది. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో.. నాగశౌర్య హీరోగా వస్తున్న బైలింగ్వల్ మూవీలోనూ.. ఎంసీఏ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోని టెక్నీషియన్స్, హీరోల ఓపికను పరీక్షిస్తోందట. బైలింగ్వల్ మూవీకైతే హీరో సహా అంతా ఉదయం 9:30కి వచ్చి షూటింగ్ స్పాట్‌లో కూర్చుంటే ఈ అమ్మడు మాత్రం 11కో.. 12కో వస్తోందట. సాయి పల్లవి తీరు కారణంగా నాగశౌర్య ఈ ప్రాజెక్ట్‌నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పినప్పటికీ అమ్మడి తీరు మాత్రం మారటం లేదట. ఎంసీఏ సినిమా షూటింగ్‌లో సాయి పల్లవి అలాగే బిహేవ్ చేసిందట. దీంతో హీరో నాని చాలా ఇరిటేట్ అయ్యారని తెలుస్తోంది. ఈ కారణంగానే దిల్ రాజు రీసెంట్‌గా లాంచ్ అయిన తన సినిమా కోసం సాయి పల్లవిని అప్రోచ్ అవలేదని టాక్.