సేవా కార్యక్రమాలతో సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

టీఆర్ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీ న్యూస్‌ ఎండీ జోగినపల్లి సంతోష్‌కుమార్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్‌ జిల్లా నగునూరు దుర్గామాత ఆలయంలో సంతోష్‌ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంతోష్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఇతర ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో నేతలు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేతలు నాగేందర్‌ గౌడ్‌, భేతి సుభాష్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతలు,  కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు విద్యార్థి నేతలు తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

బషీర్‌బాగ్‌ దుర్గామాత ఆలయం దగ్గర సంతోష్‌కుమార్ జన్మదిన వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. శాట్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, సామ స్వప్నసుందర్‌ రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, మమతాగుప్తా ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ సహా పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మలక్‌పేట అంధ బాలికల పాఠశాలలో సంతోష్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి చిన్నారులతో  కేక్‌ కట్‌ చేయించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు.

అంబర్‌పేట్‌ ఆంధ్ర మహిళా సభ దివ్యాంగుల పాఠశాలలో కూడా సంతోష్‌ కుమార్‌ పుట్టిన రోజు  వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేత అమృత్‌ సింగ్‌ ఓబిరాయ్‌ పిల్లలతో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలకు వాటర్‌ కూలర్‌ ను బహుకరించారు. పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.

కంచన్‌బాగ్‌ బీడీఎల్‌ సంతోష్‌కుమార్‌ జన్మదిన వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. బీడీఎల్‌ తెలంగాణ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు ధనకర్ణచారి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.