షెడ్యూల్ ప్రకారమే ఓయూ డిగ్రీ పరీక్షలు

ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో షెడ్యూల్ ప్రకారం డిగ్రీ పరీక్షలు యథాతధంగా నిర్వహించనున్నట్టు ఓయూ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 వ తేదీ నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొన్నీమధ్య వాయిదాపడ్డ ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్ డబ్ల్యు పరీక్షలు ఈ నెల 22 నుంచి కొనసాగుతాయని పేర్కొన్నారు. పరీక్షల పూర్తి టైం టేబుల్ యూనివర్శిటీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు వెల్లడించారు. పరీక్షలు వాయిదా పడ్డట్టు వచ్చే తప్పుడు వార్తలు నమ్మి విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఓయూ అధికారులు సూచించారు.