శౌర్యపతక గ్రహీతల పారితోషికాలు పెంపు!

పరమ్‌వీర్‌ చక్ర, అశోకచక్ర తదితర శౌర్య పతకాల గ్రహీతలకు ఇస్తున్న గౌరవ పారితోషికాన్ని కేంద్రప్రభుత్వం రెట్టింపు చేసింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచీ ఈ పెంపు వర్తిస్తుంది. స్వాతంత్య్రానికి ముందు.. ఆ తర్వాత శౌర్య పతకాలు పొందిన వారందరికీ రెట్టింపు గౌరవ పారితోషికం లభిస్తుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరమ్‌వీర్‌చక్ర శౌర్యపతక గ్రహీతలకు ప్రస్తుతం నెలకు రూ.10వేలు గౌరవ పారితోషికం లభిస్తుండగా…ఆ మొత్తం ఇప్పుడిక రూ.20 వేలుగా ఉంటుంది. అదే రూ.6వేలుగా ఉన్న అశోకచక్ర విజేతలకు ఇకపై రూ.12వేల గౌరవ పారితోషికం లభిస్తుంది.