వెంకీతో స్వీటీ జోడీ కడుతుందా?

‘గురు’ సినిమాతో తన సత్తా చాటిన విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమా ‘ఆటా నాదే వేటా నాదే’. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో వెంకీ సరసన అనుష్క నటించనున్నట్లు సమాచారం. ఇందులో వెంకీ ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమీయనుండటంతో ఆయన సరసన స్వీటీ అయితేనే బాగుంటుందని భావించిన యూనిట్ అనుష్కతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొద్దిరోజులుగా ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్‌గా కాజల్, తమన్నా పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వారిద్దరూ కాదంటూ అనుష్క వినిపిస్తున్నది. మరోవైపు అనుష్క కూడా తన ‘భాగమతి’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోవడంతో వెంకీతో నటించేందుకు సిద్ధంగా ఉందని టాలీవుడ్ వర్గాల టాక్‌. ఇంతకీ  వెంకీ కోసం అనుష్కను తీసుకున్నారా? లేక వేరే హీరోయిన్‌ను తీసుకున్నారా? అనేది అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.