విద్యావ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యం

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఆధారంగానే తెలంగాణ సాధించుకోగలిగామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. గత ప్రభుత్వాల్లో గాడి తప్పిన విద్యావ్యవస్థను పటిష్టం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని డిప్యూటీ సీఎం కడియం ప్రారంభించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.