లవ్ జిహాద్ పేరుతో కిరాతకం

రాజస్థాన్ లో దారుణం జరిగింది. లవ్ జిహాద్ పేరుతో ముస్లిం వ్యక్తిని కిరాతకంగా చంపాడు  ఓ వ్యక్తి. అంతేకాదు హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాజస్థాన్ లోని రాజస్మంద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని బెంగాల్ కు చెందిన మహ్మద్ బట్టా షేక్ కాగా, హత్యకు పాల్పడ్డ వ్యక్తిని శంబు లాల్ గా గుర్తించారు. బైక్ పై గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లిన శంబులాల్.. వెనుక నుంచి గొడ్డలి దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మొత్తం మరో వ్యక్తి చేత వీడియా తీయించాడు. లవ్ జిహాద్ కు పాల్పడ్డ ప్రతి ఒక్కరికీ ఇదే గతి పడుతుందంటూ శంబు లాల్ హెచ్చరించడం ఈ వీడియోలో కనిపించింది. అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శంబులాల్ ను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి గులాబ్ చంద్ చెప్పారు.