లక్ష్మీపూర్‌లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ చేరుకున్న సీఎం..  కాళేశ్వరం గ్రావిటీ కాల్వ సొరంగం పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మరికాసేపట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి పనులపై సీఎం ఆరా తీయనున్నారు. సమీక్ష అనంతరం జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం గంటల వరకు రాంపూర్ పంప్‌హౌస్ పనులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3:45 గంటల వరకు మిడ్ మానేరు ప్రాజెక్టు పనుల పరిశీలన చేయనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు సీఎం బయల్దేరుతారు.