రెండు ట్రక్కులు ఢీ: ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌లో అదుపుతప్పిన రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ట్రక్కుల మధ్య వెళ్తున్న బైక్ కూడా నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.