రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తోపాటూ పలువురు కేంద్ర మంత్రులు పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు బౌద్ధ సన్యాసులు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.