రష్యా అధ్యక్ష ఎన్నికల బరిలో మళ్లీ పుతిన్!

రష్యా ప్రెసిడెంట్‌  పుతిన్‌ మరోసారి దేశాధ్యక్ష పదవికి పోటీ పడనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పుతిన్ సైతం ధ్రువీకరించారు. 2000 సంవత్సరం నుంచి పుతిన్ అధికారాన్ని తన చేతిలోనే ఉంచుకుంటున్నారు. దేశాధ్యక్షుడిగా, ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. వచ్చే మార్చిలో జరిగే ఎన్నికల్లో గెలిస్తే, 2024 వరకు మళ్లీ ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు.

పుతిన్‌కు పోటీగా ఈసారి అధ్యక్ష బరిలో టీవీ జర్నలిస్టు సీనియా సబ్‌  చాక్ నిలబడుతారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ పోటీ నుంచి తప్పుకున్నారు. అవినీతి ఆరోపణలతో ఆయన్ని రాజకీయంగా వెలివేశారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పుతిన్ గెలిస్తే, జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను అత్యధిక కాలం ఏలిన నేతగా పుతిన్ నిలుస్తారు.