రవాణాశాఖాధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి

హైదరాబాద్‌లో ఓ రవాణాశాఖాధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు రైడింగ్ చేసారు. రవాణా శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రవీందర్ ఇంట్లో దాదాపు రెండు గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రవీందర్‌ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోగా.. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.