యూపీ సీఎం ఫోటోతో అంగన్ వాడి కార్యకర్త పెళ్లి!

ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌ లో ఓ అంగన్‌ వాడీ కార్యకర్త ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కు వెరైటీగా నిరసన తెలిపారు. తమ సమస్యలు పట్టించుకోవటం లేదన్న కోపంతో ఏకంగా ఆమె యోగి ఆదిత్యనాథ్ ఫోటోను పెళ్లి చేసుకున్నారు. అచ్చం పెళ్లి తంతు ఎలా జరుగుతుందో అలాగే సంప్రదాయబద్దంగా ఈ పెళ్లి నిర్వహించారు. పెళ్లి కూతురు సీఎం ఆదిత్యనాథ్ ఫోటోతో ఏడు అడుగులు నడిచింది. తరువాత పెళ్లికి హాజరైన వారందరికీ మిఠాయిలు పంచారు. ఈ పెళ్లికి వందల సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.

సీఎంను పెళ్లి చేసుకుంటే నాలుగు లక్షల మంది అక్కచెల్లెళ్లకు మేలు కలుగుతుందని తాను భావిస్తున్నానని పెళ్లికూతురు నీతూసింగ్ తెలిపారు. పెళ్లి చేసుకున్న తరువాతనైనా సీఎం యోగికి మహిళల విలువ తెలుస్తుందని అనుకుంటున్నానని చెప్పారు.