మోడీకి బుద్ధి చెప్పండి!

ప్రధాని మోడీకి బుద్ధి చెప్పే అవకాశాన్ని గుజరాత్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. గుజరాత్ ప్రజల్లోనూ మోడీపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌కోట్‌లో లెక్చరర్స్, టీచర్స్ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నోట్ల రద్దు లాంటి భారీ తప్పిదాలను భవిష్యత్‌లో మరోసారి చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి మన్మోహన్‌ సింగ్‌ సలహా ఇచ్చారు. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు విధ్వంసకర నిర్ణయమని చెప్పారు. నోట్ల రద్దు సమయంలో కోట్లాది రూపాయల బ్లాక్‌మనీ వైట్‌ గా మారిందని మన్మోహన్ మండిపడ్డారు. ప్రధాని నిర్ణయంతో దేశంలో లక్షలాది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని, కొత్త ఉద్యోగాలు రాలేదని విమర్శించారు.