మేడిగడ్డ బ్యారేజీ పనులు పరిశీలించిన కేసీఆర్

తుపాకుల గూడెం బ్యారేజీ సందర్శన అనంతరం.. మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు సీఎం కేసీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ సీఎంతో పాటు పనులను పరిశీలించారు.