మేడారం పంప్‌హౌజ్‌ పరిశీలించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా  నంది మేడారం పంప్‌హౌజ్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మేడారం ప్యాకేజీ-6 పంప్‌హౌజ్ పనులను, టన్నెల్‌ను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అంతకుముందు రామగుండం ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 8వ యూనిట్ పనులను సీఎం పరిశీలించారు.  మరికాసేపట్లో రామడుగు మండలం లక్ష్మీపూర్ కు సీఎం చేరుకోనున్నారు. అక్కడ కాళేశ్వరం గ్రావిటీ కాల్వ సొరంగం పనులను సీఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం రామడుగులో భోజన విరామం, తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం గంటల వరకు రాంపూర్ పంప్‌హౌస్ పనులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3:45 గంటల వరకు మిడ్ మానేరు ప్రాజెక్టు పనుల పరిశీలన చేయనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు సీఎం బయలుదేరుతారు.