మెడికల్ కాలేజీ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. దివిటిపల్లి మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్రం శివారులోని బైపాస్ రోడ్డు, పాలమూరు కొత్త కలెక్టరేట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్ హాజరయ్యారు. అంతకుముందు మయూరి పార్క్ లో హంసలకొలను, జిప్ సైకిల్, ఆర్చరీ, రైఫిల్ షూట్, జిమ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.